Saturday, February 28, 2015

మన జాతి గర్వించదగ్గ శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్

ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే సందర్భంగా జగదీశ్ చంద్రబోస్ గురించిన వ్యాసం క్రింది లింకులో చదవండి.

జగదీశ్ చంద్రబోస్

Thursday, February 26, 2015

ఇదీ.. నిజాంగారి మంచితనం..!

ఇది 26-02-2015 నాటి ఆంద్రభూమి దినపత్రికలో వచ్చిన వరిగొండ కాంతారావు, హనుమకొండ, వ్యాసం.

జనవరి 8 నాటి ఆంధ్రభూమి ఫోకస్‌లో వి.ప్రకాశ్‌గారు ‘వాస్తవాలు చూడాలి’అన్న శీర్షికన నిజాంలోని మంచితనాన్ని గ్రహించాలని రాసిన వ్యాసం చదివాక ఈ లేఖ రాయాలనిపించింది. నిజాం మంచితనంగా వారు భావించిన విషయాలకు సంబంధించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1. నిజాం పరువును నడిబజారులో వేలంవేసే పరిస్థితిని పండిత మదన్‌మోహన్‌మాలవ్యా తెచ్చినందున మాత్రమే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి నిజాం ప్రభువు విరాళాన్ని ఇచ్చారన్నది బహిరంగ రహస్యం.

2. జైహింద్ ఉద్యమంలో పాల్గొన్నందున హైదరాబాదు రాష్ట్రంలో తమ ప్రవేశాలను కోల్పోయిన విద్యార్థులకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశాలను ఇవ్వకూడదన్న నిబంధనను విధించేందుకుగాను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తాము ఇచ్చిన విరాళాన్ని నిజాం ప్రభుత్వం వాడుకున్నది. ఈ కారణంగానే సర్ సి.ఆర్.రెడ్డి కొంతమంది విద్యార్థులకు ఇచ్చిన ప్రవేశాలను రద్దుచేశారు. స్వర్గీయ పి.వి.నరసింహారావు, భండారు సదాశివరావు వంటి వారు నాగపూరులోనూ తదితర ఉత్తరభారత విశ్వవిద్యాలయాలలోనూ విద్యనభ్యసింపవలసి వచ్చింది.

3. నిజాం ప్రభుత్వంలో ఉర్దూకు మొదటి స్థానం, మరాఠికి రెండవ స్థానం, తెలుగు భాషకు మూడవ స్థానం ఇచ్చారు. ‘తెలంగీ బేఢంగి’ అని తెలుగుభాషను అవహేళన చేసినారు. ఒకానొక సభలో అయితే ఉర్దూలో మాట్లాడండి లేదంటే మరాఠిలో మాట్లాడండి. తెలుగులో మాట్లాడడానికి వీలులేదు’అని ప్రకటించిన దరిమిలా భరించలేని అవమానంతో సభనుండి బయటకువచ్చిన తెలుగువారు తమ భాషకు తగుమాత్రపు గౌరవాన్ని సంపాదించుకొనేందుకుగాను ఏర్పరచుకొన్న సంస్థ శ్రీ కృష్ణదేవరాంధ్ర భాషా నిలయం.

రావిచెట్టు రంగారావుగారు సుల్తాన్‌బజారులోని తమ ఇంటిని భాషా నిలయము నిమిత్తము వాడుకొనుటకు ఇచ్చినారు. ఆ స్థలమును ఎంపికచేయుటకు ప్రధాన కారణము అది ‘రెసిడెన్సీ’కి (నిజాము ప్రభుత్వమునదుపులో నుంచుటకుగాను నియమింపబడిన బ్రిటీషు ఏజెంటు, నివాస కార్యస్థలమునకు దగ్గరగానుండుట. నాటి ‘రెసిడెన్సీ’యే నేటి కోఠిలోని మహిళా కళాశాల. ‘రెసిడెన్సీ’ పరిసర ప్రాంతములలో బ్రిటిషువారి అనుమతి లేకుండా నిజాం చట్టములు చెల్లకుండినవి. ఇది 1901నాటి మాట.

మరింత స్పష్టతకొరకు మరికొన్ని సత్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుట అత్యవసరము.

1. హనుమకొండలో 1904లో స్థాపించిన శ్రీ రాజరాజనరేంద్రాంధ్ర భాషా నిలయానికి 1914లో స్థల సేకరణ జరిగినది. స్థలాన్ని సేకరించిన శ్రీమాదిరాజు రామకోటీశ్వరరావు ఆ స్థలాన్ని తామిష్టపడడానికి గల కారణాలను వారి ఆత్మకథలో ఇలా నమోదుచేసికొన్నారు. ‘‘పింజర్ల చివరన, రాజపుత్రులవాడలో, రామాలయాన్ని ఆనుకొని ఉన్న ఈ స్థలం గ్రంథాలయానికి అనువుగా ఉంటుంది. ఇక్కడైతే ముస్లింల భయంకూడా ఉండదు.’’

2. హనుమకొండలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో పనిచేసిన ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావుగారు 1910 నుండి 1913వరకు శ్రీ రాజరాజనరేంద్రాంధ్ర భాషానిలయానికి కార్యదర్శిగానున్నారు. కార్యదర్శి పదవి సమాజ శాంతికి భంగం కలిగించే పని గనుక ఉద్యోగాన్నైనా వదులుకో లేదంటే కార్యదర్శిత్వాన్నైనా వదులుకో అని నిజాం ప్రభుత్వం హెచ్చరించింది. మాడపాటివారు కార్యదర్శి పదవిని మాదిరాజు రామకోటీశ్వరరావుకు అప్పగించారు. భాషానిలయంలో జరిగే సమావేశాలకు హాజరయ్యేవారిపైన పోలీసు నిఘా ఉండేది. క్రమంతప్పక భాషానిలయానికి వచ్చే పాఠకులు నెలకొకసారి పోలీసుస్టేషనులో హాజరువేయించుకొనవలసి వచ్చేది.

3. ఆనాటి ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 1881లో హిందువులలో అక్షరాస్యతా శాతం 2.98కాగా 1931నాటికి అది 2.4శాతానికి పడిపోయింది. ముస్లింలలో 1881నాటికి 4.94 శాతంగా ఉన్న అక్షరాస్యత 1931నాటికి 10.35 శాతానికి పెరిగింది. ఇది ప్రభుత్వ విద్యావిధానం కారణంగానే జరిగిందని వేరే చెప్పనక్కరలేదు.

4. ప్రభుత్వ నిర్వహణలోని తెలుగు మాధ్యమ పాఠశాలల సంఖ్య శూన్యము. ప్రభుత్వ నిర్వహణలోని ఉర్దూ మాధ్యమ పాఠశాలలకు వచ్చే ఆడ పిల్లల నిమిత్తము ఘోషా ఏర్పాటుతోనున్న ఎడ్లబండ్లు నడిపేవారు.

5. ఉర్దూ భాషను ప్రోత్సహించే నిమిత్తము ప్రైవేటుగా నడిచే తెలుగు పాఠశాలలపైన ప్రభుత్వ నిబంధనల కారణంగా 1924నాటికి 4,053గా ఉన్న పాఠశాలల సంఖ్య 1926నాటికి 1,082కి పడిపోయింది.

6. నాటి ప్రముఖ కవులలో ఒకరైన శ్రీ తిరునగరి రామాంజనేయులు తన ఇంటి అరుగుపైన కూర్చొని తెలుగు దినపత్రికను చదువుకొంటుండగా బహిరంగ స్థలంలో తెలుగు పత్రిక చదవడం నేరం కనుక జాగ్రత్తగా మసలుకొమ్మని ఆ గ్రామ పోలీసుపటేలు తిరునగరిని హెచ్చరించినాడట.

ఇవీ ఆరవ నిజాము చివరి రోజులలోనూ, ఏడవ నిజాము తొలినాళ్ళలోనూ తెలుగు ప్రజలు సంతోషంగా గడిపిన దినాలు. 

Sunday, February 22, 2015

ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో ఎందుకు కలవరు?జస్టిస్ ముర్తాజా ఫాజిల్ ఆలీ భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 1975-85 కాలంలో వ్యవహరించేరు. 1980లలో లక్నోలో మైనారిటీ విద్యా సంస్థల గురించి జరిగిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించేరు. ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో కలవడంపై ఆయన తన అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చేరు. 

"ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో ఎందుకు భాగస్వాములు కాలేదు? దానికి ఎవరు బాధ్యులు?

"నాకు బాగా గుర్తుంది. నా చిన్నతనంలో నేనొక గ్రామంలో ఉండేవాడిని. మా గ్రామంలో హిందూ-ముస్లిం సమస్య ఉండేది కాదు. మా మొహర్రం ఉత్సవంలో హిందువులు పాల్గోనేవాళ్ళు. హోలీ, దీపావళి పండగలలో మేమూ పాల్గోనేవాళ్ళం. కాలేజీ చదువు కోసం నేను పట్నం వచ్చేను. పేదవాణ్ణి కాబట్టి ఒక మురికివాడలో ఉండేవాణ్ణి. అక్కడ కూడా నాకు హిందూ-ముస్లిం సమస్య కనబడలేదు. 

"స్వరాజ్యం వచ్చిన తరువాతే హిందూ-ముస్లింల సమస్య ఇంతగా పెరిగిపోయింది. దీనికి కారణం ఏమిటి? ముస్లింల వద్దకి వివిధ రకాల హిందూ రాజకీయ నేతలు వచ్చి ఏం చెబుతున్నారు? ముస్లింల అస్తిత్వం నేడు ప్రమాదంలో పడిందనీ, మెజారిటీ సమాజం వారిని కబలించి వేస్తుందనీ, తమ పార్టీలు మాత్రేమే వారిని కాపాడగలదనీ, కనుక తమకే వోటు వేయందనీ చెబుతున్నారు. 

"ఇంకో పాత్రీ వాళ్ళు వచ్చి ముస్లిమ్లకి 30 శాతం ప్రత్యేక అధికారం కల్పిస్తామంటే, వేరొకరు 50 శాతం ప్రత్యేక అధికారాలు కల్పిస్తామంటారు. అధికార దాహంతో అన్ని పార్టీల హిందూ నేతలూ ముస్లిం వోట్ల కోసం, ముస్లింలకు తమ పార్టీనే ఎక్కువ సదుపాయాలూ కలగజేస్తుందని పోటీపడి మా ముందు జుట్లు పట్టుకుంటూ ఉంటే, మేము (ముస్లింలు) అమాయకంగా మాకు ప్రత్యక అధికారాలు వద్దు మేము జాతీయ జీవన స్రవంతిలో కలిసిపోతాం అని చెప్పమంటారా? ఎందుకు కలిసిపోవాలి? ముస్లిమ్లకేమన్నా పిచ్చా?

"ముస్లింలు జాతీయ జీవన స్రవంతిలో కలవాలంటే ముందు అధికార దాహం కల రాజకీయ నాయకులను సరిచేయండి. వారిని జాతీయ స్రవంతిలోకి తీసుకురండి. ఈ రాజకీయ నేతలే నేడు ప్రధాన జీవన స్రవంతిలో లేరు. వారిలో అధికార దాహం మాత్రమే ఉంది. అధికారం కోసం వాళ్ళు దేశాన్ని కూడా ముక్కలు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయ నాయకులు సరైన రీతిలో మారితే ఒక్క సంవత్సరంలోనే ముస్లింలంతా జాతీయ జీవన స్రవంతిలో భాగస్వాములు కాగలరు అని నేను వాగ్దానం చేస్తున్నాను." 

ఇవి జస్టిస్ ముర్తాజా గారు చెప్పిన మాటలు. ఇవి నూటికి నోరు పాళ్ళూ నిజం కూడా. 

అయితే నాకొక సందేహం. పార్శీలు బయటి నుంచి వచ్చి మన దేశంలో ఆశ్రయం పొందినవారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అప్పటి మన పాలకులు ముస్లింలు, క్రైస్తవుల లాగే పార్శీలకు కూడా మైనారిటీలుగా హోదా ఇచ్చి ప్రత్యేక హక్కులు ఇస్తామంటే దానిని పార్శీలు తిరస్కరించేరు. ఈ దేశంలో ఆశ్రయం పొందిన తాము ప్రత్యేకంగా ఎటువంటి గుర్తింపునూ పొందాలనుకోవటంలేదనీ, ఈ జాతి ప్రధాన జీవన స్రవంతిలో తామూ భాగస్వాములుగా కొనసాగుతామనీ అన్నారు. జంషెడ్ జీ టాటా, రతన్ టాటా వంటి వారు ఎందరో పారశీకులే. వారు పారిశ్రామికంగా దేశాభివృద్ధికి అందించిన సేవలు ఎవరూ మరచిపోలేనివి. మరి ముస్లింలు పార్శీల వలె ఎందుకు మైనారిటీ సౌకర్యాలను తిరస్కరించరు? జాతీయ జీవన స్రవంతిలో ఎందుకు కలవరు? దీనికి బాధ్యులు ఒక్క హిందూ రాజకీయ నాయకులేనా? ముస్లిం నాయకులు, మత పెద్దలు ఇందుకు బాధ్యులు కారా? వారు తమ స్వార్థం కోసం సాధారణ ముస్లిం ప్రజానీకాన్ని జాతీయ ప్రధాన స్రవంతిలో కలవకుండా వేరు చేయటం లేదా? దేశంలోని మతపరమైన కల్లోలాలకు వారు కూడా కారణం కాదా? 

Saturday, February 21, 2015

మాతృభాష కోసం మహోద్యమంఅంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన మా నాన్నగారు ఆచార్య దుగ్గిరాల విశ్వేశ్వరం గారి వ్యాసం ఈ క్రింది లింకులో చదవండి. 


Thursday, February 19, 2015

కుతంత్రాలకు లొంగని జాతీయ నిష్ఠ

19 ఫిబ్రవరి 2015 నాటి ఆంధ్రభూమి దినపత్రికలో వచ్చిన నా వ్యాసం "కుతంత్రాలకు లొంగని జాతీయ నిష్ఠ" క్రింది లింకులో చదవండి.

కుతంత్రాలకు లొంగని జాతీయ నిష్ఠ

Tuesday, February 17, 2015

విశ్వములోని ఏకత్వమే శివతత్త్వం


శివరాత్రి శివునికి ప్రీతికరమైన రోజు . త్రిమూర్తులలో శివుడు లయకారుడు. లయం అంటే అంతరించిపోవడం. అనగా ఈ అనంత విశ్వములోని ప్రతిదీ తమ అహంకార కారకములైన భౌతిక, బౌద్ధిక, మానసిక రూపములను వదిలి నిరాకారమైన అనంత తత్త్వంలో కలిసిపోవడం. ఈ ఏకత్వాన్ని సూచించేదే శివలింగము. ఈ లింగోద్భవము జరిగినది అర్థరాత్రి మాఘ బహుళ చతుర్దశి తత్కాల అమావాస్య నాడు. అమావాస్య ఐక్యానికి ప్రతీక. అమావాస్య నాడు చంద్రుడు కనబడడు. అమావాస్య అంటే కలిసి ఉండటం (అమా = యుగప్తు: వాస = కలిసి ఉండటం). ఖగోళశాస్త్రం ప్రకారం అమావాస్య నాడు సూర్యచంద్రులు కలిసి ఉంటారు. సూర్యుని యొక్క కాంతిలో మిళితమైపోవడం వల్ల ఆరోజు చంద్రుడు కనబడడు. పగలు సూర్యుడు కనిపిస్తాడు. కాని రాత్రి కనబడడు. సూర్యచంద్రులు తమ స్వస్వరూపములను వదలి ఒకదానిలోనొకటి ఐక్యమై అదృశ్యమైపోయే అర్థరాత్రి సమయం లింగోద్భవ కాలం. అది కూడా చతుర్దశి వెళ్ళిపోతూ అమావాస్య మొదలయ్యే క్షణాలలో. అంటే లయం కాబోయే క్షణాలలో కొద్దిగా ఒక సన్నని చద్రరేఖ ఉంటుంది. దీనిని సూచిస్తూనే పరమశివుడు సన్నని చంద్రరేఖను శిరస్సున ధరిస్తాడు. "కిశోర చంద్రశేఖరే ... " అని కదా శివతాండవస్తోత్ర ప్రస్తుతి.

లయకారుడైన శివుడు విశ్వములోని అభేదమునకు రూపము. సకల దేవీదేవతలూ ఆయనలో లీనమై ఉంటారు. అందుకే ఈ అభేదాన్ని స్మరిస్తూ మనం శివ ధ్యానం చెయ్యాలి. 

శైవోవైష్ణవో వా2పి యో వా స్యాదన్యపూజకః
సర్వ పూజాఫలం హన్తి శివరాత్రి బహిర్ముఖః
-- శివరాత్రిని విస్మరించి శివుని గాని విష్ణువుని గాని లేక మరే దేవతను పూజించినప్పటికీ ఫలితం శూన్యం అని 'ఈశ్వర సంహిత' చెప్తుంది.

కూర్మపురాణంలో వరాహ అవతారియైన విష్ణువు ఇలా అంటాడు:

అహం యత్ర శివస్తత్ర శివో యత్ర వసుంధరే
అహం తత్రాపి తిష్ఠామి ఆవయోర్నాంతరం క్వచిత్
శివం యో వందతే భూమే! స హి మామేవ వందతే
-- విష్ణువుకు, శివునికి భేదం లేదు. నేనెక్కడ ఉంటే శివుడు అక్కడ ఉంటాడు. శివుడు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. భూదేవిని ప్రార్థిస్తూ శివారాధన చేసినవారు విష్ణువును కూడా పూజించినట్లే.

యామేవ కేశవం దేవమాహు: దేవీ థాంబికా
-- భక్తులు నన్ను కేశవుడు, శివుదు, దేవి, అంబిక అనే నామాలతో పిలుస్తారు.

పరాత్పరం యాంతి నారాయణ పరాజనాః
నతే తత్ర గామిష్యన్తి యే ద్విషన్తి మహేశ్వరం
-- నారాయణుని పూజించినా, మోక్షప్రాప్తి పొందినా సరే శివ ద్వేషం పనికిరాదు.

ఇలా విశ్వములోని ఏకత్వ రూపుడైన ఆ పరమేశ్వరుని నిత్యం స్మరిద్దాం. 

Friday, February 13, 2015

రైల్వే ప్రమాదం - చురుగ్గా స్పందించిన స్వయం సేవకులు - సేవా కార్యక్రమాల్లో నిమగ్నం

13/02/2015, బెంగళూరు : నేటి ఉదయం కర్ణాటక - తమిళ్ నాడు సరిహద్దు ప్రాంతమైన అనేకళ్ తాలుకా బిజార్ నగర్ వద్ద ' బెంగళూరు - ఎర్నాకులం' ఎక్ష్స ప్రెస్ పట్టాలు తప్పిన దుర్ఘటన జరిగింది, ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు చురుగ్గా స్పందించి సహాయ - పునారావాస కార్యక్రమాల్లో ప్రభుత్వ బృందాలకు సహకరించారు, గాయపడ్డ ప్రయాణికులకు సత్వర ప్రాథమిక చికిత్స అందిచడానికి స్వయం సేవకులు ప్రత్యెక బృందాలతో వైద్య సహాయం అందిచడం జరిగింది.


ఎంత విచిత్రం?క్రైస్తవ మతస్తులకు క్రీస్తు ఒక్కడే దేవుడు. బైబిల్ ఒక్కటే పవిత్ర గ్రంధం. 

కానీ లాటిన్ కేథలిక్కులు సిరియన్ కేథలిక్ చర్చిలోకి అడుగుపెట్టరు. ఈ రెండు వర్గాలవారూ మార్తోమా చర్చిలోకి అడుగుపెట్టరు. ఈ మూడు వర్గాలకు చెందినవారు పెంటేకాస్ట్ చర్చి మొహం చూడరు. ఈ నాలుగు వర్గాలవారూ సాల్వేషన్ ఆర్మీ చర్చి గుమ్మం తొక్కరు. ఈ ఐదు వర్గాలవారు సెవెన్త్ డే ఎడ్వెన్టిస్ట్ చర్చిలోకి అడుగుపెట్టరు. ఈ ఆరు వర్గాలవారూ ఆర్థొడాక్స్ చర్చికి వెళ్ళరు. పై ఏడు వర్గాలవారు జాకోబైట్ చర్చికి వెళ్ళరు.

ఇలా ఒక్క కేరళ రాష్ట్రంలోనే క్రైస్తవులలో 146 వర్గాలున్నాయి. వీళ్ళల్లో ఎవరూ మరొకరి చర్చిలలోకి వెళ్ళరు, మరొకరిని తమ చర్చిలలోనికి రానివ్వరు! ప్రపంచమంతటా క్రైస్తవులలో ఇదే గోల. 

అందరికీ ఒకే క్రీస్తు, ఒకే బైబిల్, ఒకే యెహోవా. కానీ ఎంత ఆశ్చర్యం. ఎంత సిగ్గుపడాల్సిన విషయం? వీళ్ళా ప్రపంచాన్నంతటినీ క్రీస్తు సామ్రాజ్యంగా ఏకం చెయ్యాలనుకుంటున్నది?


సరే .. ఇంకా ఇస్లాం ముచ్చట. 


మహామ్మదీయులందరికీ ఒకే అల్లాహ్ .. ఒకే కురాన్ .. 

కానీ వీళ్ళలో షియాలకు, సున్నీలకు ప్రపంచంలో ఎక్కడా ఒకరంటే ఒకరికి పడదు. ఒకరినొకరు చంపుకుంటూనే ఉంటారు. ముస్లిం దేశాలలోనే ఈ రెండు వర్గాల మధ్య నిత్యం కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి. 

షియాలు సున్నీల మసీదులకి వెళ్ళరు. వీళ్ళిద్దరూ అహమ్మదీయుల మసీదులకి వెళ్ళరు. ఈ మూడు వర్గాలవారూ సూఫీ వారి మసీదుల్లోకి అడుగుపెట్టరు. ఈ నాలుగు వర్గాలవారు ముజాహిద్దీనుల మసీదుల వైపే చూడరు. 


ఇలా ముస్లింలలో పదమూడు ప్రధాన వర్గాలున్నాయి. వారిలోని ఉప వర్గాలకు లెక్కేలేదు. ఒకరినొకరు చంపుకోవడం, ఒకరిపైనొకరు బాంబులు వేసుకోవడం, సామూహిక హత్యాకాండలు, అత్యాచారాలు ముస్లింలలో మామూలే. 


ఇరాక్ దేశంపై అమెరికా దాడి చేయడాన్ని ఆ చట్టు ప్రక్కల ఉన్న ముస్లిం దేశాలన్నీ సమర్ధించాయి. 

ప్రపంచంలో బహాయీ సంప్రదాయం వారు ఉన్నారు. వారు కూడా అల్లాని ఆరాధిస్తారు. ఖురాన్ని నమ్ముతారు. ఒకే ఒక్క తేడా ఏమిటంటే మహమ్మద్ ప్రవక్త మరో రూపంలో వస్తాడని వారు అన్నారు. అంతే ఒక్క టెహరాన్ (ఇరాన్ రాజధాని) లో ఒక్క గంట వ్యవధిలో ఏభై ఆరు వేల మంది బహాయీలని ఊచకోత కోసేరు. ఇస్లాంలో ఎంత అసహనం! 


ఒకడే ప్రభువు అల్లాహ్ .. ఒకే పవిత్రగ్రంధం కురాన్. వీళ్ళా ప్రపంచాన్ని "దారుల్ ఇస్లాం"గా మార్చి శాంతిని స్థాపించేది? 

ఇక హిందువుల విషయానికొద్దాం. 

హిందూ సమాజానికి సంబంధించి 1,280 పైగా ప్రధాన మాట గ్రంధాలున్నాయి. వాటికి పదివేలకి పైగా వ్యాఖ్యానాలు, లక్షకి పైగా ఉప వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఒక్క భగవద్గీతకే వెయ్యికి పైగా వ్యాఖ్యానాలు ఉన్నాయి. హిందువులు భగవంతుడిని లెక్క లేనన్ని రూపాలలో ఆరాధిస్తారు. అమెరికాలో పర్యటిస్తున్నప్పుడు స్వామీ వివేకానందని ఎవరో అడిగారట "మీ హిందువులకు మూడు కోట్ల మంది దేవతలున్నారట. ఇదెలా సాధ్యం?" అని. అందుకు సమాధానంగా వివేకానందుడు "చూడండి! చిన్న సవరణ. ప్రస్తుతం మా దేశంలో జనాభా పెరిగింది. ఇప్పుడు మాకు ముప్పై కోట్ల మంది దేవీదేవతలున్నారు" అని అన్నారు. "ఏకం సత్. విప్రాః బహుధా వదంతి" అని ఋగ్వేదం చెప్తోంది. అంటే "సత్యం ఒక్కటే. దానిని పండితులు బహు విధాలుగా వర్ణించి చెప్తారు" అని అర్థం. 

హిందూ సమాజంలో అనాదిగా వేల ఋషులు ఉద్భవించారు. వివిధ సంప్రదాయాలకు చెందిన ఆచార్యులు నిత్యం మార్గదర్శనం చేస్తున్నారు. మన సమాజంలో ఎన్నో వేషభాషలున్నాయి. 


అయినా హిందువులు అన్ని దేవాలయాలకీ వెళ్తారు. ఒకరి పట్ల ఒకరు గౌరవ భావంతోనే ఉంటారు, ఆలోచనాపరమైన భేదాలున్నప్పటికీ. హిందువులలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి తమకు నచ్చిన రీతిలో పూజించుకోవచ్చు. కావాలనుకుంటే తమకి నచ్చినట్లు దేవుడిని తిట్టుకోవచ్చు కూడా. 


మొదటి నుంచీ హిందూ సమాజంలో దేవీదేవతల గురించి గాని, సంప్రదాయాల గురించి గానీ ఒకరితో ఒకరు వాదించుకోవడం,  ఒకరిపైనొకరు దాడి చేసుకోవడం లేనే లేవు. 


అయినా సెక్యులర్ మేధావులుగా చెలామణీ అవుతున్న వారు మాత్రం హిందువులను చాందసులుగా, అసహనపరులుగానే చిత్రిస్తున్నారు. 


ఎంత విచిత్రం !!!